Friday, February 10, 2012

అరమరికలు వీడితేనే అన్యోన్య దాంపత్యం


ప్రతి ఇల్లూ ఆనందంగా ఉండాలంటే భార్యాభర్తలమధ్య సరైన అవగాహన ఉండాలి. తమ మాటే నెగ్గాలనే పట్టుదలకు పోకూడదు. పట్టువిడుపులు ఉండాలి. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళుఅన్నట్లుగా వ్యవహరించకూడదు. ‘‘్భర్యాభర్తల తగాదా అద్దంమీద ఆవగింజ లాంటిది’’ అంటారు. అంటే వారి మధ్య గొడవలు ఎక్కువసేపు నిలవకూడదని. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, చేదోడు వాదోడుగా ఉంటేనే కాపురం సజావుగా సాగుతుంది. వారి దాంపత్య జీవితం ప్రతి నిత్యం ఎంతో ఆనందంగా ఉంటుంది.
ప భార్యాభర్తలమధ్య వచ్చే చిన్న చిన్న వాదనలే తగాదాకు దారితీయవచ్చు. అందుకే ఇద్దరూ తమ తమ వాదనలను పెంచకూడదు.
ప జీవిత భాగస్వామికి తెలియకుండా పనులుచేయడం, అబద్ధం చెప్పడం, మోసం చేయడం లాంటివి చేయకూడదు. వారిని బాధ పెట్టిన వారవుతారు.
ప భార్యాభర్తలు ఒకరి వ్యక్తిగత విషయాలను ఒకరు పట్టించుకోకూడదు. వారికి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు ఒకసారి చెప్పాలి. కానీ అదేపనిగా నస పెట్టడం, విసిగించడం సంస్కారం కాదు.
ప ఇద్దరూ ఉద్యోగస్తులైతే, నీ డబ్బులు, నా డబ్బులు అనే తేడా చూపించకూడదు. అలా విడదీసి మాట్లాడటం వల్ల భాగస్వామి మనసు నొచ్చుకుంటుంది.
ప ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులముందు జీవిత భాగస్వామిని శాసించడం, నీకేం తెలియదు అని తక్కువ చేసి మాట్లాడకూడదు. చిన్నవిషయానికి విసుక్కున్నా వారి మనసు బాధపడే అవకాశం ఉంది.
ప భర్తకానీ, భార్య కానీ తన బంధువుల, స్నేహితుల ఇంటికి, పంక్షన్స్‌కి, పార్టీలకు వెళతానన్నా వద్దు అని శాసించటం తగదు. ఆయా వ్యక్తులు నచ్చకపోతే మీరు వెళ్ళడం మానేయాలి కానీ భార్యను కానీ, భర్తను కానీ ఒత్తిడి చేయడం మర్యాద కాదు.
ప ఆర్థికపరమైన విషయాల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ ఒకరికి తెలియకుండా మరొకరు నిర్ణయాలు తీసుకోవడం, ఒక్కరే వెళ్ళి ఇంటికి కావలసిన సామాగ్రిని కొనడం లాంటివి చేస్తే భాగస్వామి మనసు నొప్పించినవారవుతారు.
ప ఫ్లాట్, స్థలం, ఇల్లులాంటి స్థిరాస్తులు కొనుక్కోవచ్చు కదా అని బంధువులు, స్నేహితులు సలహాలివ్వడం సహజం. అటువంటి సమయంలో భాగస్వామి సహకారంలో ఏవైనా లోపాలున్నా సరే వాటిని బయటివారికి చెప్పడం సభ్యతకాదు.
Source : Andhrabhoomi Daily courtesy 

Friday, December 30, 2011

వీడ్కోలు 2011-వార్తా వనితలు


ఏడాది కొందరు మహిళా నేతలు సంచలన విజయాలను నమోదు చేయగా, కొందరు ప్రముఖ మహిళలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లోకి ఎక్కారు. పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు తెరదించి ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు.
తెల్లచీరలో, రబ్బరు చెప్పులతో సాదాసీదాగా కనిపించే ‘దీదీ’ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కీర్తి దక్కించుకున్నారు. పథకం ప్రకారం ఈ ‘ఫైర్ బ్రాండ్’ చేసిన ఎదురుదాడిలో కాకలు తీరిన కమ్యూనిస్టు
నేతలు సైతం పరాభవం చవిచూశారు. తమిళనాడులో వరసగా రెండు సాధారణ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అన్నాడిఎంకె నాయకురాలు జయలలిత తన ప్రచార వ్యూహాన్ని కొత్త పుంతలు తొక్కించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. చిరకాల ప్రత్యర్థి అయిన డిఎంకెను చావుదెబ్బ తీసి ఆమె మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 199 సీట్లు సాధించి, డిఎంకెకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి జయలలిత తన ప్రతీకారం తీర్చుకున్నారు.
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంపై ఈ ఏడాది దేశంలో పలు వదంతులు చోటుచేసుకున్నాయి. ఆమె కొన్ని నెలల పాటు న్యూయార్క్ ఆస్పత్రిలో ఉంటి వైద్య చికిత్స చేయించుకున్నారు. సోనియా అనారోగ్యం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చింది. విదేశీ మీడియా ప్రకటించేవరకూ ఆమె అనారోగ్యంపై వాస్తవాలు దేశ ప్రజలకు తెలియకపోవడం విశేషం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎం.కరుణానిధి గారాలపట్టి కనిమొళి ‘2జి-స్ప్రెక్ట్రం’ కుంభకోణంలో కారాగార వాసాన్ని చవిచూడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మై 20న జైలు పాలైన కనిమొళికి కొద్ది రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది.
‘కాన్పు’పై బెట్టింగులు..
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్య రాయ్ తొలి కాన్పుపై దేశ వ్యాప్తంగా ‘బెట్టింగ్’లు చోటుచేసుకోవడం విశేషం. ఈమె కాన్పుకు సంబంధించి ‘సంయమనం’ పాటించాలంటూ మీడియాకు ఆంక్షలు విధించడం మరో విడ్డూరం. 11-11- 2011న ఐశ్వర్య ప్రసవిస్తుందన్న వార్తా కథనాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె 16-11-2011న ఆడ శిశువుకు జన్మనివ్వడంతో వేలం వెర్రి బెట్టింగులకు, తలాతోక లేని కథనాలకు తెర పడింది.
మాట తప్పిన ‘పూనం’
2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ జట్టు గెలిస్తే తాను స్టేడియంలో నగ్నంగా తిరుగుతానని ‘మత్తెక్కించే’ హామీ ఇచ్చిన ప్రముఖ మోడల్ పూనం పాండే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్‌ను మన ఆటగాళ్లు సాధించినా, పూనం హామీ మాత్రం నెరవేరలేదు. యువతను తప్పుదారి పట్టిస్తోందని ఈమెపై పలు కేసులు నమోదయ్యాయి. పూనం మాట తప్పిందని ఆగ్రహించిన కుర్రకారుకు ఆ తర్వాత నెట్‌లో ఆమె ‘బాత్‌రూం’ దృశ్యాలు కొంత ఊరటనిచ్చాయి. అశ్లీల వెబ్‌సైట్లను ప్రభుత్వం అనుమతించాలంటూ వాదిస్తున్న ఈ భామ ఇటీవల తన సొంత వైబ్‌సైట్‌ను ప్రారంభించింది.
శ్రీలక్ష్మిపై కేసులు..
మొదట్లో మంచి ఐఎఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్న ఎర్రా శ్రీలక్ష్మిపై ఓబుళాపురం గనుల కుంభకోణానికి సంబంధించి సిబిఐ కేసులు పెట్టడం రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. సిబిఐ అరెస్టు చేయడంతో కొన్ని రోజులపాటు జైలులో ఉన్న ఈమెకు ఆ తర్వాత బెయిల్ లభించింది.
సుదీర్ఘ నిరాహార దీక్ష..
‘ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్’గా ఖ్యాతిగాంచిన షర్మిల చాను చేస్తున్న నిరాహార దీక్షకు పదకొండేళ్లు పూర్తి కావడం దేశంలో సంచలనం సృష్టించింది. మణిపూర్‌లో ప్రత్యేక అధికారాలున్న సాయుధ దళాలను ఉపసంహరించాలని ఈమె 2000 నవంబర్‌లో నిరాహార దీక్ష ప్రారంభించింది. సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేస్తున్న మహిళగా చాను ప్రపంచవ్యాప్తంగా కీర్తి సాధించింది.
ఇక, బాలీవుడ్ నటి విద్యా బాలన్ ‘ద డర్టీ పిక్చర్’లో తన అందచందాలను ప్రదర్శించి వివాదాలను, కోర్టు కేసులను ఎదుర్కొంది. దివంగత నటి సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా నిర్మించిన ‘ద డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తన అద్వితీయ నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ (79) సుదీర్ఘ అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్ను మూసింది. ఎనిమిది వివాహాలు చేసుకున్న టేలర్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఎయిడ్స్ నివారణకు అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసి తన సామాజిక బాధ్యతను చాటుకుంది.
ప్రపంచంలోనే పొట్టి మహిళ..
మహారాష్టల్రోని నాగపూర్‌కు చెందిన జ్యోతి ఆమ్గే (18) ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకుంది. కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవున్న ఈమె కొద్ది రోజుల క్రితమే గిన్నిస్ రికార్డు సాధించినట్లు ధృవపత్రాన్ని పొందింది. అమెరికా మహిళ బ్రిడ్జెట్ జోర్డాన్ (69.49 సెంటీమీటర్లు) రికార్డును అధిగమించిన జ్యోతి ‘ఆకాండ్రోప్లాసియా’ అనే వైద్య సమస్య కారణంగా పొడవుగా ఎదగలేక పోయింది.

Wednesday, December 28, 2011

మొక్కల సంరక్షణ ఇలా..

ఇంటిలోపల స్థలాన్ని బట్టి కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు, ఉష్ణోగ్రతల మేరకు పెరిగే మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
మట్టికుండీల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది. ప్లాస్టిక్ కుండీలైతే అప్పుడప్పుడు నీరు పోస్తే సరిపోతుంది.
రంధ్రాలు లేని కుండీల్లో నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
మొక్కలు బాగా పెరగాలంటే గాలి బాగా ఉండే ప్రదేశంలో కుండీలు ఉంచాలి. సారవంతమైన మట్టిని వాడాలి.
వర్షాకాలం, చలికాలంలో మొక్కల వేళ్లలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది గనుక నీటిని అధికంగా పోయరాదు. ఉష్ణోగ్రత అధికంగా ఉండే వేసవిలో మాత్రమే కుండీల్లో నీరు తరచూ పోయాలి. లేకుంటే మొక్కల్లో ఆకులు మాడిపోయే అవకాశం ఉంది.
మధ్యాహ్నం కన్నా సాయంత్రం వేళలో మాత్రమే కుండీల్లో నీరు పోయాలి.
కుండీల్లో ద్రవరూపంలో ఉండే ఎరువులను వేయాలి. వేసవిలో ఎరువుల మోతాదు పెంచడం, చలికాలంలో తగ్గించడం చేయాలి.
శ మొక్కలు త్వరితగతిన పెరగాలంటే తరచూ కుండీలను మార్చడం లేదా పై భాగంలోని మట్టిని మార్చాలి.
Written by Shalini in Andhrabhoomi daily

Wednesday, December 21, 2011

చక్కని ఆరోగ్యానికి ఏడు సూత్రాలు


ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలటే మానసిక ప్రశాంతత కావాలి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నించాలి. అంతేకాని వాటినుండి పారిపోవాలని చూడకూడదు. వయసు పైన పడుతున్నా దానిని కనబడకుండా చేసుకోవాలంటే, ఏ చింతా లేని చిరునవ్వే మనకు శ్రీరామరక్ష. ‘‘మీ జీవితాన్ని మీరు ప్రేమించినట్లయితే, మీ జీవితం మిమ్మల్ని ప్రేమిస్తుంది’’ అని ఆర్థర్ రుబిన్ స్టెన్ అనే శాస్తజ్ఞ్రుడు సెలవిచ్చాడు. మీరూ అలా వుండటానికి ఈ రోజే శ్రీకారం చుట్టండి.
ఈ కింద ఇవ్వబడిన ఏడు సూత్రాలను పాటించి చూస్తే చక్కని ఆరోగ్యం మీ చెంతనే వుంటుంది.
కలహాలు మానుకోవాలి
చాలామంది ఆలుమగలు చీటికీ మాటికీ పోట్లాడుకుంటూ, సంసారాన్ని దుఃఖమయం చేసుకుంటారు. దాంపత్య జీవితంలో ఇరువురు ఒకరికొకరు సహకరించుకోవాలి. రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి రోగాలకు చాలా మటుకు మానసిక ఆందోళన మాత్రమే కారణంగా చెప్పుకోవాలి. ఆలుమగలు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంవల్ల కొన్ని సమస్యలు వస్తాయి. తాము ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి, అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి కారణం కేవలం తమ భార్యామణులేనని కొందరు మగవారు చెప్పినట్లుగా ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. దంపతులు ఎటువంటి తగాదాలు లేకుండా నిత్యం సంతోషంగా ఉండగలిగితే అనారోగ్యం దరిచేరదని నిపుణులు అంటున్నారు. ఆలుమగలు కలహాలు మాని దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటే తలనొప్పి, కీళ్ళనొప్పులు వంటివే కాక, మానసిక ఒత్తిడులు కూడా దూరమవుతాయని అమెరికాలోని హ్యూమన్ సెక్సువాలిటీ (్హఖ్ఘౄశ డళనఖ్ఘ్ప్ఘజఆక) సంస్థ చెబుతోంది. సంతృప్తికరమైన లైంగిక జీవనం గడుపుతున్న దంపతులలో ఆత్రుత, ఒత్తిడి వంటివి ఉండవని నిపుణులు చెబుతున్నారు.
శరీరంపై నియంత్రణ
మన శరరం మనతో మాట్లాడుతుందన్న సంగతి మీకు తెలుసా! ఇది నిజం. ఉదాహరణకు చూస్తే శరీరానికి సంబంధించి తలనొప్పి, ఇతర నొప్పులతో కొందరు బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వారు ఏ ఇతర పనులపైనా శ్రద్ధాసక్తులను చూపించలేరు. కొన్ని సందర్భాలలో తీవ్రమైన అనారోగ్యం పాలవుతూంటారు. వీటన్నింటికీ కారణం మానసిక స్థితిగతులు. ఈ ప్రభావం మన శరీరంపై ఉంటుంది. అనారోగ్యం తీవ్రమైతే కొన్నిసార్లు ప్రమాదానికి దారితీయవచ్చు. సాధ్యమైనంత వరకూ బాధలను మరచిపోయి ఉత్సాహంగా ఉండాలి. మన శరీరాన్ని మన అధీనంలో ఉంచుకోవాలి. దానికి ఎటువంటి బాధ కలగకుండా బాధ్యత వహించాలి. మనం చెప్పినట్లుగా మన శరీరం వినాలి కానీ శరీరం చెప్పినట్లు మనం వినకూడదు.
తగినంత నిద్ర
ప్రతి మనిషికి రోజూ తగినంత నిద్ర అవసరం. సరైన, తగినంత నిద్రలేకపోయినా, వేళకి నిద్ర పోకపోయినా, అనారోగ్యపు తలుపులు తట్టినట్లేనని చాలామందికి తెలియదు. అంతటి ముఖ్యమైన నిద్రని మనకి తెలీకుండానే చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. నేటి తరంలో, కాలంలో ప్రతి ఒక్కరికీ పని గంటలు ఎక్కువే కాబట్టి, రాత్రి పూట కనీసం 7 నుండి 9 గంటలపాటైనా నిద్రపోవాలని పరిశోధకులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా అలసిపోయిన శరీరానికీ, మనసుకూ విశ్రాంతి ఎంతో అవసరం. మనిషికి తగినంత నిద్రలేక, అనారోగ్యం పాలైతే, ఆయుర్దాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్యకరమైన ఆహారం
మన ఆరోగ్యం మనం తినే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఏం తిన్నా, దానిపైన ఇష్టంతో తినాలిగానీ, విధిలేక వేరే దారి లేక ఏదో తింటున్నాంలే అన్నట్లుగా తినకూడదు. కానీ ఈ సూత్రాన్ని పాటించేవారు చాలా తక్కువ. ఎప్పుడూ హడావుడిగా త్వరగా భోజనం, ఫలహారం పూర్తిచేయాలనే చాలామంది చూస్తారు. ఇందుకు కారణం యాంత్రిక జీవనం. ఇది అందరికీ తెలిసిన విషయమే. యాంత్రిక జీవనానికి తగినట్లుగా యాంత్రికంగా భోజనం చేయకూడదు. అలాగే మనం తినే ఆహారంలో విటమిన్లు, కాల్షియం, లవణాలు వుండేలా చూసుకోవాలి. ఇంకా తాజా పండ్లు, మంచి బలాన్ని, పుష్టిని ఇచ్చే ఆహారం కూడా అవసరం. వంట తయారీకి ఉపయోగించే నూనె నాసిరకంది కాకుండా చూసుకోవాలి. ఆహారం విషయంలో సమయపాలన చాలా అవసరం. భోజనం చేసేటపుడు ప్రశాంతంగా వుండాలి. ఎటువంటి ఒత్తిడులు వుండకూడదు. అప్పుడే సరియైన భోజనమే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం అన్న విషయానికి సార్థకత ఉంటుంది.
విధి నిర్వహణలో సంతృప్తి
‘పనే దైవం’ అంటారు. మనం ఏం పని చేసినా దానిపై అభిమానం వుండాలి. అది ఏ పనైనా సరే అయిష్టంగా చేయకూడదు. దానిమీద శ్రద్ధతో, కార్యదీక్షతో చేయాలి. అపుడే మనం సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపగలం. మనలో కొందరు తాము కోరుకున్న ఉద్యోగం రాలేదనీ, కోరుకున్న విధంగా జీవితం లేదనీ, గత్యంతరం లేక ఇష్టంలేని ఉద్యోగం చేస్తున్నాననీ బాధపడుతూంటారు. కానీ అలాంటి భావనతో ఉండటం తప్పు. మన పనే మనకు ఆధారం కాబట్టి దానిమీద విశ్వాసం ఉండాలి. అందులో కష్టాలున్నా, నష్టాలున్నా ధైర్యంతో ఎదుర్కోగలగాలి. మన పనిని మనం ప్రేమించాలి. అదే ఆరోగ్య సూత్రం.
దైవచింతన అవసరం
మనలో చాలామంది అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు అంటూంటారు. నిజమే. కానీ మానవప్రయత్నం తరువాతే ఏదైనా అన్న సంగతిని మనం విస్మరిస్తున్నాం. అంటే దైవశక్తిని, దైవాన్ని తక్కువ చేయటం కాదు. మన ప్రయత్నం మనం చేయకుండా, అన్నింటికీ దైవ సహాయం కావాలంటే ఎలా? మనం ఏ పని తలపెట్టినా సత్సంకల్పంతో, మనస్ఫూర్తిగా, నీతిగా నిజాయితీగా చేస్తే తప్పక భగవదనుగ్రహం లభిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గేందుకు అప్పుడప్పుడూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలి. మనసుకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని అందించే శాస్ర్తియ సంగీతం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించాలి. అలాగే మంచి మంచి పుస్తకాలను చదవాలి.
ఆత్మీయత అవసరం
కొంతమంది ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవారిలా కనిపిస్తారు. వీరితో చాలామంది ఆర్థికంగా, మానసికంగా నష్టపోయినవారు అయివుంటారు. ఇలాంటివారు జరిగిన దానికి బాధపడుతూ కూర్చునేకంటే నలుగురితో కలిసిపోయి సంతోషంగా, ఆనందంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం అయినవారు, ఆప్తులు, బంధు మిత్రులుసహాయం తీసుకోవచ్చు. మనసును అల్లకల్లోం చేసుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే అనారోగ్యం దరికి రాదు.
(ఆంధ్రభూమి నుంచి సేకరణ )